Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ‌సిపిఐ100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి

‌సిపిఐ100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి

0

‌సిపిఐ100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి

సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్

న్యూస్ తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ సమితి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాట జ్వాలల్లో ఏర్పడిన సిపిఐ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి దేశ ప్రజలకు వివిధమే బ్రిటిష్ క్రూర పోలీసు మూకలు ఆనాటి యువతీ యువకులను చిత్రహింసలకు గురిచేశాయి.. లక్షలాదిమంది జైళ్ళ పాలయ్యారు. రహస్య జీవితాలను గడపాల్సి వచ్చింది, సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చిన మొట్టమొదటి ఏకైక రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. దేశంలో భూ పోరాటాలను సిపిఐ ఉధృతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములను పేదలకు పంచుతున్న పరిస్థితుల్లో ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు భూస్వామిగా వారసత్వంగా తనకు సంక్రమించిన భూములు అన్నింటినీ పేదలకు పంచారు. సిపిఐ పోరాటాల ఫలితంగా దేశంలో అనేక కీలక రంగాల్లో ఇనుము, ఉక్కు తో సహా చమురు శుద్ధి కర్మాగారాలు, నూలు పరిశ్రమలు యూనివర్సిటీలు, బొగ్గు గనులు, రైల్వే కర్మాగారాలు అనేక పరిశ్రమలు 80% పైగా ప్రభుత్వ రంగంలో స్థాపించబడ్డాయి. రాజభరణాలు రద్దు చేయాలని బ్యాంకులను ఇతర కీలక రంగాల్లోని భారీ పరిశ్రమలను జాతీయం చేయాలని పోరాటాలు చేసి విజయం సాధించింది.. సీలింగ్ భూములు ప్రభుత్వ బంజరు రియల్ ఎస్టేట్ బకాసురుల కబంధహస్తాల నుండి కాపాడడానికి పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ అవకాశం ఉన్నచోట పేదలకు పంచి పెడుతూ పోరాడింది సిపిఐ అని అన్నారు. రాష్ట్రంలో 2014లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన టిడ్కో ఇళ్లను అర్హులైన పేదలకు పంచాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నివాస స్థలాలు, ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని, రాష్ట్రంలో విశాఖ ఉక్కు తో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని పోరాడుతున్నది భారత కమ్యూనిస్టు పార్టీ. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఆదుకోవాలని నిర్వహిస్తున్న పోరాటాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సిపిఐ నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తున్నది. ఈ సందర్భంగా జరుగుతున్న సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవాలను ఈ నెల 20 నుండి 26 వరకు వినుకొండ పట్టణంలో, నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ నియోజకవర్గ సమితి తీర్మానించి నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదా, మాజీ పట్టణ కార్యదర్శి పటాన్ లాల్ ఖాన్, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, రాయబారం వందనం, వూట్ల రామారావు, పిన్నిబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున రావు, రమేష్, దుర్గమ్మ, రవణమ్మ, తదితరులు పాల్గొన్నారు.(Story : ‌సిపిఐ100 సంవత్సరాల శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version