Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ పురపాలక సంఘం పరిధిలో జల కాలుష్య నివారణ చర్యలు

వినుకొండ పురపాలక సంఘం పరిధిలో జల కాలుష్య నివారణ చర్యలు

0

వినుకొండ పురపాలక సంఘం పరిధిలో జల కాలుష్య నివారణ చర్యలు

న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు, మున్సిపల్ చైర్మన్ డా. షేక్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు వినుకొండ పట్టణంలో అన్ని గృహ మరియు వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్ లు సెప్టిక్ ట్యాంకులు ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి క్లీనింగ్ చేయించుకోవలని, అందు కొరకు మున్సిపాలిటీ పరిధిలోని స్పీరిక్ సేవరేజ్ సిబ్బంది సేవలు ఉపయోగించుకొ వలసినది గా. కోరారు. మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది కలిసి సర్వే నిర్వహించి మరుగుదొడ్లు లేని మరియు సెప్టిక్ ట్యాంకులు లేని గృహాలు గుర్తించులని, సర్వే ను ప్రజలందరూ సహకరించాలని కోరారు. మరుగుదొడ్లు లేని వారు మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో టాయిలెట్ నిర్మాణం కొరకు ముందుకు రావాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ లను సరి అయిన భద్రత ప్రమాణాలు పాటించకుండా నిర్వహించరాదని, దాని వలన భూగర్భ జల మరియు భూమి కాలుష్యం అయ్యే ప్రమాదముందని అన్నారు. నిపుణుల సహాయం తప్పనిసరి, సెప్టిక్ ట్యాంక్‌లో మీథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులు ఉంటాయి. కాబట్టి, శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే ఆధునిక యంత్రాల సహాయంతో క్లీన్ చేయాలి. ఎట్టిపరిస్థితిలోనూ మనుషులు ట్యాంక్‌లోకి దిగి క్లీన్ చేయకూడదు. కెమికల్స్ ట్యాంక్‌లో అనవసరమైన యాసిడ్లు లేదా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా వేయకండి, ఇది మురుగును కుళ్ళింపజేసే బ్యాక్టీరియాను చంపేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మేనేజర్ వెంకట్రావు, మెప్మా, సచివాలయ సిబ్బంది, సి ఓ లు పాల్గొన్నారు.(Story : వినుకొండ పురపాలక సంఘం పరిధిలో జల కాలుష్య నివారణ చర్యలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version