Homeవార్తలుతెలంగాణజాతీయ స్థాయికి ఎంపికైన

జాతీయ స్థాయికి ఎంపికైన

జాతీయ స్థాయికి ఎంపికైన

హాకీ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన అండర్ 14 బాలుర రాష్ట్ర స్థాయి హాకి క్రీడా పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైన వనపర్తి జట్టు క్రీడాకారులను గురువారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు అభినందించారురాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 10 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయని, ఇందులో వనపర్తి జట్టు మొదటి స్థానంలో నిలిచినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు.ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని తిక్కగడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు వారి పేర్కొన్నారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత విద్యతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం అని క్రీడల వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జన్మనిచ్చిన గ్రామానికి తల్లిదండ్రులకు గురువులకు మన దేశానికే మంచి గుర్తింపు తీసుకురావచ్చునని ఆయన అన్నారు.జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిల్వాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.(Story :జాతీయ స్థాయికి ఎంపికైన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!