Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అన్యాక్రాంతమైన స్మశాన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి

అన్యాక్రాంతమైన స్మశాన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి

0

అన్యాక్రాంతమైన స్మశాన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి

జనసేన సమన్వయకర్త నాగ శ్రీను రాయల్

న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో, వినుకొండ పట్టణంలో గల స్మశాన వాటికలు ఎన్ని, వాటికి కేటాయించిన స్థల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలియచేయాలని వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ కు, వినుకొండ మున్సిపల్ మేనేజర్ వెంకటేశ్వర రావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ వారి రికార్డులో ఉన్న సమాచారాన్ని తెలియచేస్తామని అన్నారు. అనంతరం నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ.. వినుకొండ పట్టణంలో స్మశానం విషయంలో పట్టణ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తన దృష్టికి వచ్చిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి అన్యాక్రాంతం అయిన స్మశాన వాటికల స్థలాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆక్రమించిన స్థలాన్ని తిరిగి స్మశాన వాటికకు కేటాయించి సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యను శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దృష్టికి, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. స్మశాన వాటిక కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి, ఎవరు అయినా దాతలు స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తే స్మశాన వాటికకు నిధులు కేటాయించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణం జనసేన పార్టీ అధ్యక్షులు పఠాన్ ఈసూబ్ , నియోజకవర్గ అధికార ప్రతినిధి పారెళ్ళ అభిమన్యు , పార్టీ నాయకులు నంది కొండలరావు , కామిశెట్టి కిశోర్ , తుమ్మ అనిల్ కుమార్ , ఇల్లా పోలరాజు , సిద్ది అనిల్ కుమార్ , శావల్యపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్, నడిగడ్డ ఉప సర్పంచ్ యర్రబోతుల రామకృష్ణ , గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు కొంజేటి లక్ష్మణరావు , బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షులు యర్రంశెట్టి వెంకటేశ్వర్లు , వినుకొండ మండల కార్యదర్శి గణప రమేష్ , గోపి తదితరులు పాల్గొన్నారు. (Story:అన్యాక్రాంతమైన స్మశాన స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version