Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా పెన్షనర్ల దినోత్సవ వేడుకలు..

ఘనంగా పెన్షనర్ల దినోత్సవ వేడుకలు..

0

ఘనంగా పెన్షనర్ల దినోత్సవ వేడుకలు..

న్యూస్ తెలుగు / వినుకొండ :  ఆలిండియా పెన్షనర్ల దినోత్సవం మరియు 18వ వార్షిక సమావేశం సందర్భంగా బుధవారం పెన్షనర్ల సంఘ భవనంలో సంఘ పతాకాన్ని ప్రధాన కార్యదర్శి కాళ్ళ కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులతో ఆవిష్కరించారు. అనంతరం పెన్షనర్ల పితామహుడైన కీర్తిశేషులు డిఎస్ నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. సహాధ్యక్షులు బి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వడిఫెన్స్ అకౌంట్ లో పనిచేసిన డి.ఎస్ నకరా సుప్రీంకోర్టులో ప్రజా పిటీషన్ ను దాఖలు చేసి పెన్షన్ అనేది బహుమతిగా ఇచ్చేది కాదని అది సుదీర్ఘకాలం గా సేవలందించిన రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని, గౌరవప్రదంగా ఇచ్చేదని తీర్పు వెలువరించినందుకు ఎంతగానో కృషి చేస్తే మనం ఈరోజు ప్రశాంత జీవితం గడుపుతున్నామని అన్నారు. జనరల్ సెక్రటరీ కాళ్ళ కృష్ణమూర్తి మాట్లాడుతూ. సంఘంలో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యులు చేయవలసిన పనులను తెలియజేస్తూ జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 వరకు ఎస్ టి ఓ ఆఫీసు, నెట్ సెంటర్, మీ సేవ కేంద్రాలలో లైఫ్ సర్టిఫికెట్ ని తప్పకుండా ఇవ్వాలని కోరారు. కోశాధికారి కెవి రాఘవయ్య 2025వ సంవత్సరంకు సంబంధించిన ఆర్థిక నివేదికను జనరల్ బాడీ సమావేశంలో పెట్టి సభ ఆమోదం పొందారు. విశిష్ట అతిథులు అయిన ఉప ఖజానా అధికారి బిహెచ్పి శేష సాయి మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ పి. కోటేశ్వరరావు పెన్షనర్లకు సంబంధించిన అన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చివరిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 26 మంది పెన్షనర్ల దంపతులకు దృశ్యాలువా మరియు మెమొంటోలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఈ సి సభ్యులు ఇతర సభ్యులు హాజరయ్యారు. (Story:ఘనంగా పెన్షనర్ల దినోత్సవ వేడుకలు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version