స్కూల్స్ లో వాటర్ బెల్ ప్రోగ్రామ్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డా. కృతిక శుక్ల ఐఏఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా.షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన కార్యక్రమం వాటర్ బెల్ కావున పట్టణ పరిధిలో గల అన్ని స్కూల్స్ నందు ఈ వాటర్ బెల్ ప్రోగ్రామ్ ను క్రమంతప్పకుండ నిర్వహించాలని పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం… విద్యార్థులు డిహైడ్రేషన్,అలసట, తలనొప్పి, జీర్ణ సంబంధ మరియు మలబద్ధకం, కిడ్నీ వైఫల్యం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లేకపోవడం వంటి అరోగ్య సమస్యలకు గురికాకుండా ఉండేందుకు చేపట్టడం జరిగిందని అన్నారు. కావున ప్రతి పాఠశాలలోనూ ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు, 12:30 గంటలకు అలాగే మధ్యాహ్నం 3:00 గంటలకు తరగతి గదిలోనే ప్రత్యేక గంట మోగించి నీరు తాగేందుకు 5నిమిషాలు కేటాయించి, విద్యార్థులకు మానవ శరీరానికి నీరు ఎంత అవసరమో దాని ప్రాముఖ్యతను తెలపాలి. అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రతిరోజు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరారు.(Story : స్కూల్స్ లో వాటర్ బెల్ ప్రోగ్రామ్స్ )

