తెలంగాణ సంస్కృతి సారధి కార్యక్రమం
ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరు
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరు నందు తెలంగాణ సాంస్కృతి సారధి కార్యక్రమం టీం లీడర్ ఎన్ సువర్ణ ఆధ్వర్యంలో యువత చెడుదారుల నుండి విముక్తి వైపు, మాదక ద్రవ్యాలపై దుర్వినియోగం, విద్యార్థులు వాటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు. ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి చట్టాలు ఉన్నాయి వాటి పైన అవగాహన కార్యక్రమం, అమ్మాయిలను వేధిస్తే, ర్యాగింగ్ చేస్తే, కిడ్నాప్ చేసిన ఎలాంటి శిక్షలు గురి అవుతామని విషయాలు తెలియజేశారు. విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత భావి జీవితాన్ని ఎలా మంచి మార్గంలో సద్వినియం చేసుకోవాలో తెలియజేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువ దాని ప్రాముఖ్యత. ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగించాలో మొదలైన అంశాలను తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో సువర్ణ, శ్రీనివాసులు, కృష్ణయ్య, డప్పు నరసింహ, శివలింగం రాధా ,శ్రీదేవి ఆటపాటలతో విద్యార్థిని విద్యార్థులకు మంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడిదారు లు పోకుండా విలువైన జీవితాన్ని నిర్ణయించుకోవాలని, చక్కగా చదువుకున్నట్లైతే చదువు వల్ల మంచి నేర్చుకుని మంచి మార్గం వెల్లవచ్చని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థుల కౌన్సిలర్ సి కృష్ణయ్య, జ్ఞానేశ్వర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్, వెంకటలక్ష్మి, విమలాదేవి, వెంకటేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.(Story : తెలంగాణ సంస్కృతి సారధి కార్యక్రమం)

