Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మెరుగైన సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ 

మెరుగైన సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ 

మెరుగైన సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ 

న్యూస్ తెలుగు/వినుకొండ : గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సత్వరం మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ పరం గా 5G ఫోన్లు అందజేయడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం స్థానిక జాషువా కళా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లకు 5G ఫోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా చీప్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వినుకొండ, ఈపూరు
సిడిపిఓలు కే వాణి, ఈ. వాణి అధ్యక్షత వహించారు. జీవి మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు 70 కోట్లు విలువైన 5G ఫోన్లు 50 వేల 204 అంగన్వాడి సెంటర్లకు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వినుకొండలో 366 సెంటర్లకు 44 లక్షల విలువైన 5G ఫోన్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ ఫోన్ల ద్వారా అంగన్వాడీలు సత్వర సమాచారం తెలుసుకొని గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సత్వర ఆరోగ్య సమస్యలు తెలుసుకుని పౌష్టికాహారం అందజేసేందుకు వీలు పడుతుందన్నారు. వినుకొండ ప్రాంతంలో వికలాంగులు అధికంగా ఉన్నారని విచారం వ్యక్తం చేస్తూ, పుట్టబోయే చిన్నారులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అంగన్వాడీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలు బాధ్యతగా పనిచేస్తూ ఆరోగ్యవంతమైన చిన్నారులను అందించాలన్నారు. అలాగే ఆయా మండలాలలో అంగన్వాడీలు మెరుగైన సేవలందించినందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా బహుమతులు ఇవ్వటం జరుగుతుందని, ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 6, 000. థర్డ్ ప్రైజ్ 4,000 ఇవ్వటం జరుగుతుందని, అంగన్వాడీలు మెరుగైన సేవలు అందించాలన్నారు. కాగా కూటమి ప్రభుత్వం విదేశీ విద్యకు 10 లక్షలు అందజేయడం ద్వారా ఎంతోమంది లబ్ది పొందారున్నారు. వైసిపి హయాంలో విదేశీ విద్యకు నిధులు ఇవ్వలేదు, విద్యుత్ చార్జీలు 7 సార్లు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు అని జీవి తీవ్రంగా విమర్శించారు. అలాగే వైసిపి హయాంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పొందలేక ఆయా కాలేజీలలో సర్టిఫికెట్స్ తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పాలయ్యారన్నారు. ఆనాడు ఒక్క టీచరు ఉద్యోగం లేదు, అమ్మ ఒడి పథకం 3 లక్షల మందికి ఎగనామం పెట్టారన్నారు. వైసిపి ఐదేళ్ల దుర్మార్గ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక్క రోడ్డు నిర్మించలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు విడుదల చేసి 20వేల కిలోమీటర్ల గోతులు పూడిపించినట్లు జీవి తెలిపారు. రాష్ట్రంలో 13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేందుకు విదేశీయులు వచ్చారన్నారు. ఎనిమిది లక్షల కోట్ల విలువైన పనులు చేసేందుకు గ్రౌండ్ కూడా జరిగిందని, ఈ కారణంగా ఏడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా, ఏపీ ఐ డి సి డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు, నాయకులు బొంకూరి రోశయ్య, కే వెంకట్ రెడ్డి, పత్తి పూర్ణ, ముత్తినేని ఏడుకొండలు, గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.(Story : మెరుగైన సత్వర ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!