గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉంటే సమస్యలు ఉండవు
స్థానిక సర్పంచ్ ఎన్నికల మూడో విడత ప్రచారంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం శ్రీరంగాపురం మండలం లోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతైనా ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు మీ గ్రామ సర్పంచ్ గా గెలిస్తే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో అభివృద్ధి చెందుతాయని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
3 విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి నియోజకవర్గం లోని శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాలో, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు
ఎమ్మెల్యే ప్రచారానికి గ్రామాలలో అపూర్వస్పందన లభించింది.
రాబోయే రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు
ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, తోపాటు రైతు భరోసా రైతు రుణమాఫీ వంటి పథకాలను ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు.
గ్రామాలు కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి చెందుతాయని రాబోయే మరో మూడు సంవత్సరాలతోపాటు వచ్చే పది సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ప్రజలు తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుర్తులపై వేసి గెలిపించాలని అన్నారు
కొంతమంది మోసపూరితంగా ఓటు వేయించుకొని గ్రామాలను అభివృద్ధి చేయకుండా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అందుకోసం ప్రజలు ఆలోచించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి సర్పంచ్ లుగా గెలిపించాలని ఆయన సూచించారు
గ్రామ సర్పంచ్‌లతోపాటు వార్డు నెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులకు మీ అమూల్యమైన ఓటు వేయవలసిన అవసరం ఉందని అన్నారు.
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలనీ అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. మీ ఓటును వృధాగా ఇతర పార్టీలకు వేస్తే ప్రయోజనం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదని రెడ్డి గారు, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, సింగిల్ విండో అధ్యక్షులు కోదండరామిరెడ్డి గారు, పెప్పేరు పట్టణ అధ్యక్షులు వెంకట్రాములు గారు, నాయకులు శ్రీహరి రాజు గారు, రంజిత్ గారు, దయాకర్ రెడ్డి గారు, సత్యం గారు, షకీల్ గారు, సురేందర్ గౌడ్ గారు, వెంకటేష్ సాగర్ గారు, రాములు యాదవ్ గారు, పెబ్బేరు శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి )

