బీఆర్ఎస్ ఎక్కడుంది అన్నవాళ్లకు మొన్నటి ఫలితాలు చెంపపెట్టు
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా యాపర్ల,గుమ్మడం, బూడిదపాడు,బనియాది పురం గ్రామాల బి.ఆర్.ఎస్ సర్పంచుల అభ్యర్థులు వెంకట్ రెడ్డి,నాగేష్,గూడెం.రవి,విజయ్ గౌడ్ గార్ల తరపున విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన అంటూ ప్రజా సంక్షేమం పక్కన పెట్టీ ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మొదటి విడత ఎన్నికలో బుద్ధి చెప్పిన తీరు మారలేదని ఒక్కపూట ఫుట్ బాల్ ఆడడానికి 5కోట్లతో స్టేడియం,500కోట్లతో లియోన్ మెస్సి నీ పిలిపించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి చేయలేదనీ సంక్షేమ పథకాలకు కత్తెర వేశారని రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టారు యాసంగి రైతు బంధుకు దిక్కులేదని విమర్శించారు. అడగకముందే రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా ,24గంటల కరెంట్,సకాలములో యూరియా ఇచ్చి రైతులను రాజులను చేస్తే రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల పాలు చేశారని అన్నారు. ఓట్లు దండుకోవడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళకు 2500,వృద్ధులకు 4000,వికలాంగులకు 6000,తులం బంగారం,కె.సి.ఆర్ కిట్టు,విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ,నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ప్రతి ఓటు కె.సి.ఆర్ గారికి అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలను కె. సి.ఆర్,పరిశుభ్రత,పచ్చదనం,వైకుంఠదాముల కోసం నిధులు కేటాయించి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్,కార్మికులను నియమించి గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తే కాంగ్రెస్ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశారు అని ఘాటుగా విమర్శించారు. కెసిఆర్ సుపరిపాలన మళ్ళీ రావాలంటే బి.ఆర్.ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story :బీఆర్ఎస్ ఎక్కడుంది అన్నవాళ్లకు మొన్నటి ఫలితాలు చెంపపెట్టు )

