Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ “అనేక వైపుల” నవలా పుస్తక సమీక్ష

“అనేక వైపుల” నవలా పుస్తక సమీక్ష

0

“అనేక వైపుల” నవలా పుస్తక సమీక్ష

న్యూస్‌తెలుగు/ అనంతపురం :
పాణి రాసిన “అనేక వైపుల” నవల పుస్తక సమీక్షా సమాలోచన సభ అనంత హక్కల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమర రాహుల్ అధ్యక్షతన స్థానిక పెన్షనర్స్ భవన్ నందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా చెన్నా రామమూర్తి నవల వస్తువుపై, మరో వక్త డా సి.యన్ కృష్ణారెడ్డి నవలా శిల్పం పై ప్రసంగించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి రెడ్డి, విరసం సీనియర్ రచయిత నాగేశ్వరాచారి, ఒపడిఆర్ నాయకులు అడ్వకేట్ ప్రకాష్ అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… రాయలసీమ ఆస్తిత్వ ఉద్యమ చరిత్ర గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తు వైవిధ్యంగా పట్టి చూపుతుందన్నారు. ప్రధానవక్త చెన్నా రామమూర్తి నవలను విశ్లేషిస్తూ రాయలసీమ జీవితానికి సమగ్రంగా చిత్రించిన నవలగా, సీమ సమాకాలిన స్థితిగతులను అద్దం పట్టేలా ఉద్యమ పరిస్థితులు ఈ నవల చర్చిస్తుందన్నారు. సీమ వెనుకబాటుతనాన్ని అనేక వైపుల నుంచి అర్థం చేసుకోవటం లో ఈ నవల బాగా తొడ్పడుతుందన్నారు. ఈ సమావేశం లో రాయలసీమ విద్యార్థుల వేదిక బాద్యులు వెంకటేష్, రాయలసీమ సాంస్కృతిక వేదిక లక్ష్మీ, విద్యార్థి సంఘాల నాయకులు పిడి ఎస్ యు వీరేంద్ర, పి ఎస్ ఎఫ్ అబ్దుల్ ఆలం, రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.(Story:”అనేక వైపుల” నవలా పుస్తక సమీక్ష)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version