Homeవార్తలుతెలంగాణఅధికారం,అహంకారం పై సామాన్యుడి గెలుపు

అధికారం,అహంకారం పై సామాన్యుడి గెలుపు

అధికారం,అహంకారం పై సామాన్యుడి గెలుపు

పొలికెపాడు గ్రామంలో బంగారయ్య గెలుపు

న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాల్పేట మండలం పోల్కేపాడు గ్రామంలో అధికార అహం పై…… ఓ సామాన్యుడి తిరుగుబాటు అధికారంతో విర్రవీగుతున్న వ్యక్తికి పోలికపాడు గ్రామ ప్రజలు గుణపాఠం చెప్పారని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. బంగారయ్య లాంటి మంచి వ్యక్తులను రెండవదశ,మూడవదశ పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని, ఎవరికి భయపడకుండా నిజాయితీగల వ్యక్తులని గెలిపించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం పోలికేపాడు గ్రామంలో సర్పంచ్ గా గెలుపొందిన బంగారయ్యను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. వార్డు సభ్యులు మన్నెం యాదవ్, ఎం.డి మంజూర్, సింగారపు శివమ్మ, వడ్డేమాన్ స్వామి. లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్, బీ.ఎస్పీ నియోజకవర్గ నాయకులు మైబుస్, వెంకటేశ్వర్లు, రామస్వామి, తిరుమల శంకర్, ఎం. డి నిరంజన్, ఎన్ బలరాం, పేట రాములు, వెంకటస్వామి, ఎక్స్ ఎంపి.టి.సి జి శేఖర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : అధికారం,అహంకారం పై సామాన్యుడి గెలుపు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!