Home వార్తలు తెలంగాణ సవాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి

సవాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి

0

సవాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి

మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి

న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సవాయి గూడెం,పెద్దగూడెం తాండా,పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సవాయి గూడెం గ్రామములో నియంత పాలనకు చరమగీతం పాడాలని రామాలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రెండేళ్లుగా గ్రామములో ఎటువంటి అభివృద్ధి జాగలేదని నాయకుల పెత్తనం కోసం గ్రామములో కలహాలు సృష్టించి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు శ్రీలతను గెలిపిస్తే గ్రామ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు.రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం ఎరువుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని సకాలం పంటలు చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయిరని అన్నారు. గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని గ్రామాలు అభివృద్ధి పచ్చదనం పరిశుభ్రత ఉండాలంటే బి.ఆర్.ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను మహిళలకు 2500,వృద్ధులకు 4000,తులం బంగారం ,కె.సి.ఆర్ కిట్టు, కంటివెలుగు, విద్యార్థినులకు స్కూటీలు, ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా,నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కె.మాణిక్యం,వేణు రెడ్డి, విజయ్ కుమార్,ధర్మా నాయక్,గంధం.పరంజ్యోతి,శివన్న,చిట్యాల.రాము,మాజీ కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,ఉంగ్లం. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,డాక్టర్.డ్యానియల్, జోహెబ్ హుస్సేన్,మంద.రాము, తదితరులు పాల్గొన్నారు.(Story : సవాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి శ్రీలతను గెలిపించండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version