Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ దుర్మార్గపు చర్య

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ దుర్మార్గపు చర్య

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ దుర్మార్గపు చర్య

న్యూస్ తెలుగు/వినుకొండ : వైసిపి హయాంలో ఏర్పాటైన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ధారా దత్తం చేయడం దుర్మార్గపు చర్య అని వైసిపి నియోజకవర్గ పరిశీలకులు ఎనుమల మురళీధర్ రెడ్డి, పిఎసి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో సేకరించిన 63 వేల పైచిలుకు సంతకాల పత్రాలను బాక్సుల్లో భద్రపరిచి, ప్రత్యేక వాహనం ద్వారా బుధవారం నాడు వైసిపి పల్నాడు జిల్లా కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుండి లాయర్స్ స్ట్రీట్ మీదుగా స్థానిక నరసరావుపేట ఆర్ అండ్ బి రోడ్డు వరకు.భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని వైసిపి మండల కన్వీనర్లు, వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు మురళీధర్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి మహా స్పందన వచ్చిందని, దీన్ని కూటమి ప్రభుత్వం తప్ప, అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయని వారన్నారు. వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ఆరోగ్యశ్రీ, నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు వచ్చాయని వారన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన వంటి కార్యక్రమాలకి వేలకోట్లు ఖర్చు చేయడం జరిగిందని, నేడు ఆ పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వారు విమర్శించారు. స్వాతంత్ర్యం ఏర్పడ్డ నాటినుండి రాష్ట్ర మొత్తం మీద 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాగా, వైసిపి ఐదేళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర అనుమతి తెచ్చి ఏర్పాటు చేయగా, అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని వారన్నారు. నేడు మిగతా మెడికల్ కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేయకుండా వ్యక్తిగత స్వార్థం కోసం కాలేజీలను ప్రైవేటుపరం చేయ, తలపెట్టడం పేద విద్యార్థుల బ్రతుకుల్లో విషం చిమ్మటమేనని వారు ఘాటుగా విమర్శించారు. నేడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ అధ్వానంగా మారి ఆసుపత్రులలో వైద్యులు పేదలకు వైద్య సేవలు అందించడం లేదన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయాసలకోర్చి కేంద్రంతో మాట్లాడి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు మెడిసిన్ విద్య దక్కకుండా పోతుందన్నారు. కేవలం డబ్బులు వసూలు చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను తలపెట్టిందన్నారు. వైసిపి హయాంలో ఏర్పడిన హెల్త్ సెంటర్లు, సచివాలయ వ్యవస్థ, ఆర్బికే కేంద్రాలు నేడు నిర్వీరమై పోతున్నాయని, మాటలు కోటలు దాటడం తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించడం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో కి పోతున్నదన్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని గాంభీరాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం. నేటి వరకు ఎక్కడ ల్యాండ్ కన్వెన్షన్ జరగలేదని, వచ్చేవారు పరిశ్రమలు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కోటి సంతకాల సేకరణకు, కోటి సంతకాలు పైగా మద్దతు పత్రాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ రాష్ట్ర గవర్నర్కు అందజేయడం జరుగుతుందని మురళీధర్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు పగడాల వెంకటరామిరెడ్డి దండు చెన్నయ్య, అమ్మి రెడ్డి అంజిరెడ్డి, ఎంఎన్ ప్రసాద్, జడ్పిటిసిలు చౌడయ్య, రాజా, బొల్లాపల్లి ఎంపీపీ పి గురవయ్య, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, టి రమణమ్మ, వైసీపీ మండల కన్వీనర్లు కొత్తమాసు శివ, కే నారాయణరెడ్డి, కొండలు, ముప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కరణ దుర్మార్గపు చర్య )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!