ప్రజల శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా కె.సి.ఆర్ .పాలన
సంక్షేమ పథకాల కోతల పాలన రేవంత్ రెడ్డిది
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రెండవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకూరు,చింగుంటపల్లి, అచ్చుతాపురం గ్రామాల బి.ఆర్.ఎస్ అభ్యర్థులు పృథ్వీనాథ్ రెడ్డి, ధర్మశాస్త్ర,శాంతన్న తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయిన ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కొనసాగించలేకపోయిందని అన్నారు.కొత్త పథకాలు ఇవ్వకుండా గతములో ఉన్న పథకాలకు కోత పెట్టిందని విమర్శించారు.యూరియా కోసం రైతుల అగచాట్లు,బోనస్ బకాయిలు,రైతు భరోసా ఎగవేత,చాలిచాలని కరెంటు,మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు.మహిళలకు 2500,వృద్ధులకు 4000,తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్,గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా విమర్శించారు.
ప్రజలు ఆలోచించి కె.సి.ఆర్ పాలనకు,రేవంత్ రెడ్డి పాలనను బేరీజు వేసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, సింగల్ విండో అధ్యక్షులు, వెంకట్రావు, మండల అధ్యక్షులు కె మాణిక్యం,రవిప్రకాష్ రెడ్డి, గులాం ఖాదర్, నీల స్వామి, మధులత, మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, ప్రేమ్ నాథ్ రెడ్డి,యువత అధ్యక్షులు చిట్యాల.రాము మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : ప్రజల శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా కె.సి.ఆర్ .పాలన )

