Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగురాలు అయిన దళిత మహిళ భూమిని కొట్టేసిన..మాజీ ఎమ్మెల్యే బొల్లా..

దివ్యాంగురాలు అయిన దళిత మహిళ భూమిని కొట్టేసిన..మాజీ ఎమ్మెల్యే బొల్లా..

0

దివ్యాంగురాలు అయిన దళిత మహిళ భూమిని కొట్టేసిన..మాజీ ఎమ్మెల్యే బొల్లా..

1962 లో తాము కొన్న పొలాన్ని 2022 లో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని మమ్మల్ని బెదిరించి ఆక్రమించాడు..

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్డు, చెక్క వాగు సమీపంలోని 309/1-3బి రెండు ఎకరాల భూమిని నా తల్లి బొప్పూడి మేరియమ్మ 1962 లో కొనుగోలు చేశారు. ఆమె తదానంతరం వారసత్వ హక్కుగా నాకు లభించింది. అప్పటినుండి 2022 వరకు భూమి మా ఆధీనంలో ఉంది. అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మా భూమి ప్రక్కన నాలుగు ఎకరాలు కొనుగోలు చేసి అక్రమంగా అధికారం అడ్డుపెట్టుకొని మా రెండు ఎకరాలు కూడా తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మా భూమిని ఆక్రమించారని అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ను కలసి విన్నవించుకోగా పోలీసులతో బెదిరించారు. చేసేది ఏమీ లేక బలహీనులైన మేము ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇటీవల మా రెండు ఎకరాలతో పాటు నాలుగు ఎకరాలు మొత్తం కలిపి 6 ఎకరాల భూమిని బొల్లా బ్రహ్మనాయుడు విక్రయించగా సదరు కొనుగోలుదారులు భూమిని చదును చేస్తుండగా మేము అడ్డుకున్నాం. మా భూమిని మాకు ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పించాలని, మా వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తో ఉదహరిస్తూ బుధవారం వినుకొండ తహసిల్దార్ ఎం. సురేష్ నాయక్Suresh Nayak, Vinukonda కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణ చెరలో ఉన్న మా భూమిని ఇప్పించి న్యాయం చేయవలసినదిగా కోరారు.(Story : దివ్యాంగురాలు అయిన దళిత మహిళ భూమిని కొట్టేసిన..మాజీ ఎమ్మెల్యే బొల్లా.. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version