ఆటో బోల్తా..మహిళ మృతి
న్యూస్ తెలుగు/వినుకొండ: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం మండల పరిధిలోని నీలగంగవరం మలుపు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వినుకొండ నుండి 15 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో హైవే రోడ్డు నుండి నీలగంగవరం మలుపు వద్ద బోల్తా కొట్టింది. దీంతో యనుమల సాయమ్మ 55, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వినుకొండ తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయమ్మ మృతి చెందింది. గాయాలైన వారిలో ఇరువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు తరలించారు. వినుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(Story :ఆటో బోల్తా..మహిళ మృతి )

