Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రోటరీ సంస్థలో యువత భాగస్వామ్యం కావాలి

రోటరీ సంస్థలో యువత భాగస్వామ్యం కావాలి

0

రోటరీ సంస్థలో యువత భాగస్వామ్యం కావాలి

న్యూస్ తెలుగు/వినుకొండ : సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అంతర్జాతీయ రోటరీ సంస్థ లో యువత భాగ స్వామ్యం పెంచేందుకు కృషి చేయాలని రోటరీ క్లబ్ 3150 జిల్లా గవర్నర్ డా .ఎస్.వి రాంప్రసాద్ అన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం రాత్రి వినుకొండ వచ్చారు. వినుకొండ కారంపూడి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో రోటరీక్లబ్ వినుకొండ అధ్యక్షుడు యేరువ వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో డా .రాంప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తొలుత ఎన్ఎస్పి కాలనీలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో దాత గంగినేని రామయ్య రోటరీక్లబ్ సంయుక్తంగా సుమారు రూ.3లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. నూజండ్ల మండలం తెల్లబాడుc6r పాఠశాలకు ఫ్యాన్ లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్క రించారు. అసిస్టెంట్ గవర్నర్ జె. మురళి, ఏపీ రీజియన్ గవర్నర్ ఎయిడీ పి. రమేష్, వినుకొండ క్లబ్ కార్య దర్శి ఎస్కే బాజీ, ఆర్థిక కార్య దర్శి పొత్తూరి నవీన్ సుధాకర్ , వివిధ విభాగాల జోనల్ చైర్మన్ లు ఆలా శ్రీనివాసరావు , చిరుమామిళ్ళ కోటేశ్వరరావు , ముత్తినేని గిరిబాబు క్లబ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అతిథులకు స్వాగతం పలుకుతూ చిన్నారి టి. వైష్ణవి సంప్రదాయ నృత్యప్రదర్శన అలరించింది. పుట్టిన రోజు జరుపుకుంటున్న తిరుపతి రాయుడు అనే క్లబ్ సభ్యునిచే గవర్నర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.(Story : రోటరీ సంస్థలో యువత భాగస్వామ్యం కావాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version