Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి

ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి

ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి

గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో గిరిజన ప్రజా సంఘాలు. బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో సర్వేనెంబర్ 430 లో ప్రభుత్వ బంజర భూమి 170 ఎకరాలు ఉండగా,
గత కొంతకాలం నుండి ఏపీ గిరిజన సంఘం, గిరిజన సంఘాల ఐక్యవేదిక, పిడిఎం తదితర ప్రజాసంఘాలు జిల్లా కలెక్టర్ కి పలుమార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. నేటి వరకు రెవిన్యూ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన తిరిగి సోమవారం బొల్లాపల్లి తాహసిల్దార్ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే జరిపి నిరుపేద గిరిజనులకు భూములు పంచాలని కోరురు. బొల్లాపల్లి మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటా నాయక్, ఐక్య గిరిజన సమాఖ్య రాష్ట్ర స్థాయి కార్యదర్శి బి. శీను నాయక్, ఏఐవైఎఫ్ నాయకులు బి. రాంబాబు నాయక్, పిడియం నాయకులు షేక్ మస్తాన్ రావు, నల్లపాటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!