వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ధర్నా
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) పిలుపుమేరకు ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చేందుకు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీల యందు సదరు బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల సీఈవోలు మరియు సిబ్బంది వారి న్యాయమైన కోరికలు సాధించేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో జిడిసిసి బ్యాంక్ ఆవరణలో ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 2019, 2024 సంబంధించి వేదన సవరణ చేయాలని, జీవో నెంబర్ 36 ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎటువంటి నిబంధనలు లేకుండా జీతభత్యాలు ఇవ్వాలని, 2019 తరువాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారుమంచి పిఎసిఎస్ సీఈవో మరియు ప్రాథమిక సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వై.వి.నారాయణ, పల్నాడు జిల్లా యూనియన్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి పోకా కోటేశ్వరరావు , ఉమ్మడి గుంటూరు జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు జాలాది నాగ ప్రసాద్, వినుకొండ బ్రాంచ్ పరిధిలోని ఇతర సీఈవోలు, సిబ్బంది ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ధర్నాకి మద్దతుగా మాజీ విశ్రాంత ఉద్యోగి మాజీ రాష్ట్ర ప్రాథమిక సంఘాల యూనియన్ కార్యదర్శి శ్రీ ప్రేమనాథ్ ప్రకాష్ పాల్గొన్నారు.(Story : వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల ధర్నా )

