వైసిపి కోటి సంతకాలకు మహా స్పందన బొల్లా
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వినుకొండలో విజయవంతం అయిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గంలో మహా స్పందన వచ్చి 60 వేల సంతకాల సేకరణ విజయవంతంగా జరిగిందన్నారు. వైసిపి హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటై ఏడు పూర్తి అవ్వడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం నిధులు లేవని, సాగుతో ఆ కాలేజీలు పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ధారాజత్వం చేసేందుకు పూనుకుందన్నారు. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మిగతా కాలేజీలు కూడా పూర్తవుతాయని, అవి అలాగే పెట్టి అక్కడ యోగ, ఇక్కడ మరో కార్యక్రమం అంటూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈనెల 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలు రాష్ట్ర గవర్నర్ కు ఇవ్వనున్నారని బొల్లా తెలిపారు.(Story : వైసిపి కోటి సంతకాలకు మహా స్పందన బొల్లా )
