పర్వీజ్ కు పిహెచ్.డి అవార్డు లేఖను అందజేస్తున్న రిజిస్టార్ ఆచార్య సింహాచలం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం న్యాయశాస్త్రంలో వినుకొండ ప్రాంతానికి చెందిన ఎస్.కె. ఎండి అబుతాలిబ్ పర్వీజ్ కు పీహెచ్.డి డిగ్రీని ప్రదానం చేసింది. ఏఎన్యూ పరిశోధన పర్యవేక్షకులు డాక్టర్ ఏ.గురువయ్య పర్యవేక్షణలో ఏ క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అండ్ అవేర్నెస్ ఇనిషియేటివ్స్ ఫర్ ది రూరల్ పూర్ త్రుది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పారా లీగల్ వాలంటీర్స్ అండ్ లా స్టూడెంట్స్ స్పెషల్ ఫోకస్ ఆన్ గుంటూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్” అనే అంశంపై పర్వీజ్ పరిశోధనలు పూర్తి చేశారని పరిశోధన విభాగం సమన్వయకర్త డాక్టర్ పి.సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఏఎన్యూ రిజిస్టార్ ఆచార్య జి.సింహాచలం పరిశోధనలు పూర్తిచేసిన పర్విజ్ కు పీహెచ్.డీ డిగ్రీ అవార్డు లేఖను అందజేశారు. వినుకొండ ప్రాంతానికి చెందిన పర్వేజ్ను ను పలువురు ప్రముఖులు, స్నేహితులు అభినందించారు.(Story : పర్వీజ్ కు పిహెచ్.డి అవార్డు లేఖను అందజేస్తున్న రిజిస్టార్ ఆచార్య సింహాచలం )

