Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

సిపిఐ ఆధ్వర్యంలో దేశ ప్రజలకు దార్శ నికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

న్యూస్ తెలుగు / వినుకొండ : భారతదేశ ప్రజలకు గొప్ప దార్శనికుడు దిక్సూచి, ప్రజా హక్కుల ప్రధాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో శనివారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. దేశ ప్రజలకు హక్కుల ప్రధాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కులమతవర్గ వర్ణ విచక్షణ లేని సమాజం నిర్మాణం కోసం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని, భారత దేశ ప్రజలకు అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని అందించారని ఆయన అన్నారు. సీనియర్ న్యాయవాది పిజే లూకా మాట్లాడుతూ. ఆనాటి సమాజంలోని పేద దళిత బహుజన వర్గాలకు న్యాయం కోసం పోరాడారని, ఆ ప్రజల హక్కులను కాపాడుటకు రాజ్యాంగంలో అనేక హక్కులను పేదలకు ప్రసాదించాడని ఈనాడు ఆ రాజ్యాంగం దేశ ప్రజలందరికీ అస్త్రంలా ఉపయోగపడుతున్నదని ఆయన అన్నారు. కానీ రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన అధినేతలు పాలకులు పక్కదోవ పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కుల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం వామ పక్షాలు అభ్యుదయ భావాలు కలిగిన లౌకికవాద పార్టీలు కలిసి పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము రాయబారం వందనం పిన్నిబోయిన వెంకటేశ్వర్లు కొప్పరపు మల్లికార్జునరావు షేక్ కిషోర్ లాయర్ విజయ్, సుకుమార్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.(Story:సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments