Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు..

వినుకొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు..

వినుకొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు..

న్యూస్ తెలుగు/ వినుకొండ :

టిడిపి ఆధ్వర్యంలో..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. దేశ సమగ్రతకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అంబేద్కర్ కి అంజలి ఘటించారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో..

భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను వినుకొండ పట్టణంలో నరసరావుపేట రోడ్డు లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావు, రాయబారం వందనం, వినుకొండ మార్కెట్ యాడ్ చైర్మన్ మీసాల మురళీ కృష్ణ యాదవ్, మాల మహానాడు నాయకులు పిడుగు విజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ధూపాటి సుకుమార్, సీనియర్ న్యాయవాదులు పీజే లూకా, డి విజయ్, కాకాని నాగేశ్వరరావు, ఎం.అశోక్ బాబు, ఎడారి కోయల గుమ్మడి కళాపీఠం తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అక్కడే జరిగిన సభకు సీనియర్ న్యాయవాది పీజే లూకా అధ్యక్షత వహించారు. ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. ప్రస్తుత రాజకీయాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పనిచేస్తున్నాయని, లౌకిక ప్రజాస్వామ్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత పాలకులు ఆచరణలో చూపించటలేదని ఆవేదన వ్యక్త చేశారు. భారత రాజ్యాంగాన్ని సమీక్షించుకొని సరైన పద్ధతులు అమలు చేసుకోవడానికి మేధావులందరూ ఎంతైనా కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేయాలని, మనమంతా ఐక్యతతో పోరాడావలసిన సమయం ఆసన్నమైందని పలువురు వక్తలు తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యక విలువలు లౌకిక తత్వానికి పాలకుల విధానం ద్వారా ఆరోధం వస్తూ ఉన్నదని సీనియర్ న్యాయవాది పీజే లూకా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామికవాదులు మరకతశిల శక్తులు ఒకటిగా నిలిచి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరిపే లాగా కృషి చేయాలని చెప్పారు. అంబేద్కర్ ని కొనియాడుతూ గేయాలు ఆలపించారు. హాజరైన సభికులకు యువ అంబేద్కర్ ధూపాటి సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ఆధ్వర్యంలో..

వినుకొండ పట్టణంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో, ఆయన నేతృత్వంలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న ప్రభుత్వమే నిజమైన అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరిస్తోందని నాయకులు పేర్కొన్నారు. అనాదరణకు గురైన వర్గాలకు రాజకీయాల్లో గౌరవ స్థానం కల్పిస్తూ, మంత్రివర్గంలో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి సామాజిక న్యాయాన్ని సాధించిన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నని చెప్పారు. పేద కుటుంబాలకు ఉన్నత స్థాయి విద్య అందేలా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అంబేద్కర్ కలలు కన్న సమానత్వ సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి నని నాయకులు హర్షించారు.

గుమ్మడి కళా పీఠం ఆధ్వర్యంలో..


డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కళాకారులు
పురవీధులలో అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తూ జోహార్ అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు జోహార్లు
మీ ఆశయాలు కొనసాగిస్తాం అంటూ నినాదాలు చేస్తూ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి గుమ్మడి కళా పీఠం కోశాధికారి
ముఖ్యాని రామయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్ అందరివాడని, సమ సమాజం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అని,
రాజ్యాంగం నిర్మాణం ద్వారా అందరికీ అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషిచేసిన మహనీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి కళాపీఠం కార్యదర్శి దేవరపల్లి నాగేశ్వరరావు, వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, కళాకారులు పెద్దలు పారేళ్ళ సుబ్రహ్మణ్యం, సాంబశివరావు, ప్రచార కార్యదర్శి పారేళ్ల దత్తు, పిట్టల శీను, అజయ్ తదితరులు గాయకులు మణి తదితరులు పాల్గొన్నారు.

 మాల మహానాడు ఆధ్వర్యంలో..

పట్టణంలో మాలమహానాడు కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ మాట్లాడుతూ. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల బానిస బతుకులను రూపుమాపాలని, అందరిని సమానంగా నిలిపేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ అధ్యక్షులు గుడిపూడి ఏసురత్నం, వినుకొండ నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు బేతం దేవానంద్, గౌరవాధ్యక్షులు పమిడిపల్లి ఇజ్రాయిల్, గౌరవ సలహాదారులు కొమ్మతోటి కృపయ్య, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, వినుకొండ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు రాయని, తదితరులు పాల్గొన్నారు.(Story:వినుకొండలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!