Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఉత్తమ విద్యావిధానం ఏపీలో రూపుదిద్దుకుంటోంది

దేశంలోనే ఉత్తమ విద్యావిధానం ఏపీలో రూపుదిద్దుకుంటోంది

0

దేశంలోనే ఉత్తమ విద్యావిధానం ఏపీలో రూపుదిద్దుకుంటోంది

*కూటమి ప్రభుత్వం 18నెలల్లో ప్రభుత్వబడుల దశ మారుతోంది
*జగన్‌ పాలనలో అధోగతిపాలైన ప్రభుత్వ బడులకు కొత్తజీవం
*విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ సంస్కరణలతో కొత్త మార్పులు
*మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు / వినుకొండ : దేశంలోనే ఉత్తమ విద్యావ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకుంటోందని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన, మంత్రి లోకేష్ శ్రద్ధ, సంస్కరణలతో ప్రభుత్వ బడుల దశ మారుతోందని తెలిపారు. జీవో 117 వంటి అరాచక నిర్ణయాలతో జగన్ పాలనలో అధోగతి పాలైన ప్రభుత్వ విద్యకు ఈ మార్పు లతో కొత్తజీవం పోసినట్లైందన్నారు. జరుగుతున్న మార్పులను పేరెంట్ – టీచర్‌ మీటింగ్‌ల ద్వారా ఆ పురోగతి మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెడుతున్నట్లు చాలా సంతోషంగా ఉందన్నారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్, చీకటీగలపాలెం ఏపీ మోడల్ స్కూల్ లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన, తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవి మాట్లాడుతూ. వైకాపా పాలనలో అన్నివిధాల ధ్వంసమైన విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. బ్యాగులు, బూట్లు, కిట్లపై ఫోటోల పిచ్చిలేకుండా రాజకీయాలకు దూరంగా విద్యావ్యవస్థకు సరికొత్త రూపునిస్తున్నారన్నారు. బెస్ట్‌ టీచర్లుగా ఎంపికైన వారిని సింగపూర్ పంపించి శిక్షణ చాలా మంచి విషయం అని, అదేస్ఫూర్తితో వినుకొండ నియోజకవర్గంలో బెస్ట్‌ టీచర్లుగా వచ్చేవారిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చు లతో సింగపూర్ పంపిస్తామన్నారు. అలానే 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాపర్‌కు రూ.3 లక్షలు, జిల్లాస్థాయిలో రూ. 2లక్షలు, నియోజకవర్గ స్థాయిలో రూ.లక్ష అందిస్తా మన్నారు. నియోజకవర్గంలో సగటు మార్కుల్లో ముందున్న స్కూళ్లకు ఉత్తమ స్కూల్ అవార్డ్, రూ. లక్ష ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఆటల్లో స్కూల్స్‌ను ముందు ఉంచే పీఈటీలకు కూడా రూ. లక్ష చొప్పున ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఉపాధ్యాయుల మధ్య ఐకమత్యం పెంచడాని కే బెస్ట్‌ స్కూ‌ల్స్ విధానం తీసుకుని వచ్చామన్నారు. ప్రభుత్వం ద్వారా స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పిం చడంతోపాటు టీచర్లలో ఐక్యత, బోధన ప్రమాణాల పెంపు కోసం ఎన్నోవిధాల కృషి జరుగుతోం దన్నారు. అందులో భాగంగానే ఖర్చుకు వెనకాడకుండా ప్రతిచోట డిజిటల్ క్లాస్‌ రూమ్‌లు తెస్తున్నామని, రాష్ట్రం మొత్తం 590మార్కులు దాటిన విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ రూ. 20వేలు ప్రోత్సాహం ఇవ్వడం చాలామంచి విషయమన్నారు. అలానే పాఠశాలల్లో కొత్త ఇస్తున్న హోలిస్టి క్ ప్రోగ్రెస్‌ కార్డుల ద్వారా చదువుతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యంపైనా దృష్టి పెట్టే అవకాశం వచ్చిందన్నారు. తల్లికి వందనం ద్వారా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు రూ.15వేల సాయం చేయడం తమ ప్రభుత్వం చిత్తశుద్ధి నిదర్శనమన్నారు. చదువులతో పాటు ఆటల్లోనూ విద్యార్థులను ముందు ఉంచేందుకు ప్రతిస్కూల్‌లో పీఈటీ పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:దేశంలోనే ఉత్తమ విద్యావిధానం ఏపీలో రూపుదిద్దుకుంటోంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version