Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి

న్యూస్‌తెలుగు/ అనంతపురం :
రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో స్క్రబ్ టైపస్ కేసులు నమోదవుతున్న కారణంగా జిల్లా లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….
స్క్రబ్ టైపస్ వ్యాధి ముఖ్యంగా రికెట్ సియా అను బ్యాక్టీరియా ( సూక్ష్మ క్రిమి) వలన వచ్చునని ఈ బ్యాక్టీరియా మైట్స్ ( పిడుదులు , చిడుములు ) యందు ఉండునని పేర్కొన్నారు.ఈ వ్యాధి లక్షణాలు, లో ముక్యంగా తీవ్ర తలనొప్పి, జ్వరము, తీవ్ర వంటి నొప్పులు ఉంటాయని, శరీరము మీద దద్దుర్లు, కళ్ళకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. చర్మము పై మైట్ లార్వా కుట్టినచోట నొక్కబడినట్లు ఎర్రటిపుండు ఏర్పడి నల్లని పెచ్చులతో కూడి ఉంటుందన్నారు.
ఈ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని తెలిపారు. ఈ లక్షణాలు కనపడిన వెంటనే సమీప పి హెచ్ సి, సి హెచ్ సి, సెంటర్లను సంప్రదించాలని పిలుపునిచ్చారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు హాస్టల్లో గ్రామసభల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల్లో, ఇండ్ల చుట్టూ పొదలు తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైపస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. (Story:స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version