మదర్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవితో జీవిస్తున్న వారికి పోషకార పంపిణీ
న్యూస్‌తెలుగు/ సింగరాయకొండ : సింగరాయకొండలో మదర్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవితో జీవిస్తున్న వారికి పోషకార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మదర్ ల్యాండ్ సొసైటీ సొసైటీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కూరపాటి నాగమణి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథులుగా లారీ యూనియన్ ప్రెసిడెంట్ గిరి మరియు యూనియన్ నాయకులు పటేల్ గారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెంచల బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి పొరపాటు నాగమణి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సింగరాయకొండ కేంద్రంగా మదర్ ల్యాండ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని వివరించారు. ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పిస్తూనే ప్రజలను చైతన్యం చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలను ప్రజలకు చేకూర్చడంలో ఎంతో మా సిబ్బంది కృషి చేశారని తెలియజేశారు. ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగాలని పిలుపునిచ్చారు.విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రాం అసోసియేటివ్ భాస్కరరావు మాట్లాడుతూ HIV తో జీవిస్తున్న వారు సకాలంలో మందులు వాడుకుంటూ మంచి పోషకాహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మించాల బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో మదర్ ల్యాండ్ సొసైటీ చేస్తున్నటువంటి కృషిని అభినందించారు. హెచ్ఎతో జీవిస్తున్న వారికి పోషకారాన్ని దాతల మరియు దేవి సి ఫుడ్ వారి సహకారంతో సమీకరించి అందజేయడం సిబ్బంది యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు.(Story:మదర్ అండ్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవితో జీవిస్తున్న వారికి పోషకార పంపిణీ)
