Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం

విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం

0

విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం

 ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మొహమ్మద్ జమాల్ఖాన్

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలంలో నిమ్మల గూడెం ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం జరిగినతల్లిదండ్రులు”ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల యాజమాన్యం ప్రత్యేక ఆహ్వానం మేరకు_జమాల్ఖాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా_జమాల్ ఖాన్ మాట్లాడుతూ.విద్యార్థుల చదువు,వారి ప్రవర్తన, పాఠశాల అభివృద్ధి గురించితల్లిదండ్రులు,ఉపాధ్యాయులతో కలిసి చర్చించుకోవలసిన అవసరం ఉందని అన్నారు.ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఎలా గౌరవిస్తారో,ఇతరుల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కూడా ప్రేమ,గౌరవాన్ని అలవరచుకొని ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయులను విద్యార్థులతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు కూడా గౌరవించాలని అన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని అన్నారు._
విద్యార్థులలో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా యోగా మరియు క్రీడలను నిర్వహించాలని అన్నారు._
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ సమన్వయంతో పని చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో
పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.(Story:విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version