Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి

కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి

కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి

న్యూస్ తెలుగు / వినుకొండ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్, ప్రజాసేవలో ఆదర్శప్రాయ నేతగా నిలిచిన స్వర్గీయ కొనిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా, వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పి ఏ సి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సూచనలతో పార్టీ నాయకులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు అర్పించి, ఆయన ప్రజాసేవా పరమార్థాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రోశయ్య ప్రదర్శించిన పరిపాలనా నైపుణ్యం, ప్రశాంతత, ప్రజల పట్ల అంకితభావం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తున్నాయి. నైతికత, వినయం, ప్రజల సమస్యల పట్ల అనుభూతి కలిగిన నాయకుడు అరుదు. రోశయ్య అలాంటి మహనీయుల్లో ఒకరు. ఆయన సేవలను స్మరించుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు, మన గౌరవం కూడా” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోశయ్య కి నివాళులర్పించారు.(Story:కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!