Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య వర్ధంతి 

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య వర్ధంతి 

0

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య వర్ధంతి 

న్యూస్ తెలుగు /వినుకొండ : పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మద్రాస్ గవర్నర్, ఆర్థిక మంత్రి, ఎంపీ, శాసనసభ్యులు కొణిజేటి రోశయ్య వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న రోశయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీప్ వీఫ్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి జీవి ఆంజనేయులు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి గా, మద్రాస్ గవర్నర్ గా, ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రానికి అనేకసార్లు ఆర్థిక మంత్రిగా, ముందుకు నడిపిన మాజీ శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా కొణిజేటి రోశయ్య చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. ప్రతిపక్షాలను సైతం రోశయ్య తనదైన వాగ్దాటితో హుందాగా సమాధానం చెప్పే వారిని గుర్తు చేశారు. నేటి యువత రోశయ్య సేవలను కొనసాగించాలని, రోశయ్య ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సీనియర్ నాయకులు రెడ్డి వెంకటరత్నం, మోటమర్రి నరసింహారావు, పువ్వాడ కృష్ణ, మేడమ్ రమేష్, చిలంకూరి కోటేశ్వరరావు, అన్న మల్లికార్జున రావు, నిశ్శంకర శ్రీనివాసరావు, పెమ్మసాని నాగేశ్వరరావు, పల్ల మీసాల దాసయ్య, ఇమ్మడిశెట్టి రమేష్, అప్పల రాజా, తదితరులు పాల్గొన్నారు.(Story:ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొణిజేటి రోశయ్య వర్ధంతి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version