Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అనంత జిల్లా లో కొత్త గా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాలేదు

అనంత జిల్లా లో కొత్త గా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాలేదు

0

అనంత జిల్లా లో కొత్త గా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాలేదు

జిల్లా ఇంచార్జ్ డిఎంహెచ్వో డా. ఎస్. బి విష్ణుమూర్తి

న్యూస్ తెలుగు/అనంతపురం : అనంత జిల్లా లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాలేదు అని జిల్లా ఇంచార్జ్ డిఎంహెచ్వో డా. ఎస్. బి విష్ణుమూర్తి బుధవారం పేర్కొన్నారు. జిల్లా ఇంచార్జ్ జిల్లా వైద్యాధిక శాఖ అధికారి ఎస్. బి. విష్ణుమూర్తి, జిల్లా సర్వలెన్స్ ఇంచార్జ్ అధికారి సి. సురేందర్ రెడ్డి విశాలాంధ్రతో మాట్లాడుతూ… 2025 జనవరిలో 4 నాలుగు కేసులు, ఫిబ్రవరిలో రెండు కేసులు నమోదైనప్పటికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆలమూరు, రాప్తాడు, గాండ్లపర్తి, మూడు అనంతపూర్ పరిధిలో కేసులు నమోదయాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఓరిఇంటియా శిశుగమోషి బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నారు. ఇది చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల సోకుతుంది అన్నారు. ఇది సాధారణంగా పొలాలు, గడ్డి, పొదలు, పశువుల కాటిళ్లు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కాటు వేసిన

చోట నల్ల మచ్చ ఏర్పడుతుందన్నారు. 5 రోజులకంటే ఎక్కువ జ్వరం  లక్షణాలని తెలిపారు. దీనిని నిర్ధారించుకోవడానికి రక్త పరీక్ష ఐ జి ఎం, ఎలీసా రక్త పరీక్ష చేయాలన్నారు. రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చే డాక్సీసైక్లిన్ లేదా అజీథ్రోమైసిన్ మందులతో పూర్తిగా నయం అవుతుందన్నారు. జ్వరం ఎక్కువ రోజులు ఉన్నవారు తక్షణమే వైద్యులను సంప్రదించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రత గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంత జిల్లాలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా కాదని తెలిపారు.(Story : అనంత జిల్లా లో కొత్త గా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాలేదు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version