సమాజ శ్రేయస్సుకు విద్యావంతుల సేవలు చాలా అవసరం
న్యూస్‌తెలుగు/వనపర్తి ; సమాజ శ్రేయస్సుకు విద్యావంతుల సేవలు చాలా అవసరం విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారిది ఎనలేని పాత్ర అని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. కెమిస్ట్రీ విభాగంలో మణిపూర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాధించిన జాగృతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి వినోద్ కుమార్ ను అఖిలపక్ష ఐక్యవేదిక ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, మొదటినుండి విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి లో చాలామంది విద్యావంతులు తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపుతూ గౌరవ డాక్టరేట్ తెచ్చుకుంటున్నారని, వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నామని. వనపర్తి లో మంచి వాతావరణం తెస్తున్నది విద్యావంతులేనని.. వారిని చూసి విద్యార్థులు కూడా భవిష్యత్తులో వీరి బాటలోనే నడుచుకోని మంచి పొజిషన్ లోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, బొడ్డుపల్లి సతీష్, రాజనగరం రామస్వామి, శివకుమార్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. (Story:సమాజ శ్రేయస్సుకు విద్యావంతుల సేవలు చాలా అవసరం)
