బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సాయి నీల భర్త ను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం నాగవరానికి చెందిన బిఅర్ యస్ పార్టీ మహిళా నాయకురాలు సాయి నీల భర్త శ్రీనివాసులు వనపర్తి పట్టణం రోడ్ ప్రమాదంలో గాయపడి కారణంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇట్టి విషయం తెలుసుకొని నేడు ఆసుపత్రికి వెళ్లి కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మాజీ మంత్రి వెంట బీ అర్ యస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. (Story:బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సాయి నీల భర్త ను పరామర్శించిన మాజీ మంత్రి)

