కళా ధర్బార్ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : గుంటూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళా ధర్బార్ సంస్థ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభాప్రాంగణానికి చేరుకున్న జీవి కి కళా ధర్బార్ ప్రతినిధులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను ఆయన తిలకించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. మన కళలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి దోహదపడతాయని తెలిపారు. కళాకారులను, వారి ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నజీర్ , యాక్టర్ సుమన్, యాక్టర్ నరేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story :కళా ధర్బార్ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రభుత్వ )
