Homeవార్తలు"వానర" ఫస్ట్ లుక్ 

“వానర” ఫస్ట్ లుక్ 

“వానర”ఫస్ట్ లుక్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా “వానర”. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న “వానర” సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది.

“వానర” చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.  వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. “వానర” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – అవినాశ్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ప్రొడక్షన్ డిజైనర్ – నార్ని శ్రీనివాస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
డీవోపీ – సుజాత సిద్ధార్థ్
మ్యూజిక్ – వివేక్ సాగర్
డైలాగ్స్ – సాయిమాధవ్ బుర్రా
స్టోరీ, స్క్రీన్ ప్లే – విశ్వజిత్
సమర్పణ – శంతను పతి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు – అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
డైరెక్షన్ – అవినాశ్ తిరువీధుల (Story:”వానర” ఫస్ట్ లుక్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!