కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి..
ఏఐసిసి అబ్జర్వర్ షిఖా మీల్ బలాలా
న్యూస్ తెలుగు / వినుకొండ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న “సంఘటన సృజన అభియాన్” కార్యక్రమం లో భాగంగా, పార్టీ బలోపేతం దిశగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అబ్జర్వర్ మరియు రాజస్థాన్ ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీమతి షిఖా మీల్ బలాలా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా షిఖా మీల్ బలాలా మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. అయితే దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిజంగా పని చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ మాట్లాడుతూ. “వినుకొండ నియోజకవర్గానికి డైనమిక్ యంగ్ లీడర్ బోయపాటి రామాంజనేయులు ని పార్టీ ఇంచార్జ్‌గా నియమించడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయం. ఆయనకు పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. వినుకొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ.. “2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వినుకొండలో గట్టి పోటీని ఇస్తుంది. పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటానని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీసీసీ పలనాడు జిల్లా ఇంచార్జ్స్ కుర్షిదా బేగం, శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు బాలి రెడ్డి, వినుకొండ టౌన్ అధ్యక్షులు నాగూర్ భాషా, రాష్ట్రమైనారిటీ సెల్ సీనియర్ నాయకులు పఠాన్ కరీముల్లా ఖాన్, పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు పిడుగు విజయ్ కుమార్, వినుకొండ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు గరికపాటి లక్ష్మి, టౌన్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, వినుకొండ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్, రూరల్ మండల అధ్యక్షులు అడపాల శ్రీనివాసరావు, నూజెండ్ల మండల అధ్యక్షులు సూర్య, సీనియర్ నాయకులు దేవసహాయం, ఈపూరు మండల అధ్యక్షుడు రవి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్టీఫెన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మణికంఠ పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి..)

