Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

0

ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, దుర్గి మండల కేంద్రం మధ్యలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్ కి సంబంధించి గత రెండు వందల సంవత్సరాల నుండి ఈ రోడ్డు రాకపోకలు నడుస్తూ ఉన్నాయి. గత కొంతకాలం నుండి ఈ రోడ్డు మా భూమిలో ఉందని ఫారెస్ట్ అధికారులు రోడ్డు బాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. గండి గనుముల నుండి దుర్గి వెళ్లే మార్గం ఒక కిలోమీటర్ పూర్తిగా నిర్మాణాన్ని ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. దుర్గి వెళ్లాలి అంటే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ తో పాటు పూర్తిగా గుంతలు, కల్వర్డు దెబ్బతిన్నాయి. ఈ విషయాలు అధికారులకు తెలియజేసిన సరిగా స్పందించట్లేదు, ఈ రోడ్డుమీద నడవలంటే నరకానికి వెళ్లినట్లుగా ఉందని వాహనదారులు, పాదాచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డును బాగు చేసి, ప్రమాదాల నుండి నివారించి రైతులని, ప్రజలని, వాహనదారులని ఆదుకోవాలని నాయకులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి కనీస మరమ్మతులైన చేయించాలని కోరారు. ఆర్ అండ్ బి అధికారులు అంచనాల రూపొందించి రోడ్డు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీ. కోట నాయక్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శీను నాయక్, పిడియం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు,నాయకులు రాంబాబు నాయక్, అంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version