Home వార్తలు తెలంగాణ ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

0

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఒసి ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సి.యం ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయని వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులు, ఇంచార్జి మంత్రి నుండి వచ్చే దరఖాస్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి మొత్తం 30 ఫిర్యాదులు వచ్చాయి.
ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version