ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టుల లేఖ
న్యూస్ తెలుగు/చింతూరు : కేంద్ర భద్రత దళాలు చేపడుతున్న చరమాంకానికి ఆపరేషన్ కగార్ చేరింది. ఓవైపు దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అగ్ర నేతలలొంగబాట్లు జరుగుతున్న వేళ మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మావోయిస్టు కమిటీ బాధ్యులు అనంత్ పేరుతో సంచలన లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక అభ్యర్థన చేసింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పాలిటి బ్యూరో సభ్యుడు సోను దాదాతో పాటు, మూడు రాష్ట్రాల ప్రతినిధి అయిన చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచారని పేర్కొన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ జోనల్ కమిటీ కూడా ఆయన ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఆయుధాలు వదిలేసి అంశంలో సమిష్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని15 ఫిబ్రవరి 2026 వరకు సమయం ఇవ్వాలని కోరారు. తాము సమయం అడిగే విషయంలో ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులా నుంచి వేతకు31 మార్చి2026 వరకు గడువు విధించిందని అప్పటివరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని లేఖలో ప్రస్తావించారు.
ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తాం.
ఇక రాబోయే పీపుల్స్ లేబరేషన్ గేరెల్లా ఆర్మీ ( పి ఎల్ జి ఏ ) వార్షికోత్సవాల నేపథ్యంలో ఎలాంటి ఆపరేషన్ నిర్వహించకూడదని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎం ఎం సి కమిటీ విజ్ఞాపన చేసింది. అదేవిధంగా ఎంఎంసీ జోన్ పరిధిలోని దళ సభ్యులంతా కార్యక్రమాలను నిలిపి శ్రేయ బోతున్నట్లు తెలిపారు. ఈ లేఖలోని సందేశాన్ని వీలైనంత త్వరగా ప్రసారమాధ్యమాల ద్వారా ఆయా ప్రభుత్వాల ద్వారా అప్పుడు తమ సహచరులకు సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. లొంగిపోయే ముందు మూడు రాష్ట్రాల కొంతమంది ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం అయ్యే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తాము సామూహికంగా ఆయుధాలు వదిలి పునరావాస ప్రణాళికను అంగీకరించేందుకు ఒక నిర్దిష్టమైన తేదీని ప్రకటించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అంతా భద్రతాభారతాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేస్తే సాధ్యమవుతుందని తెలిపారు. త్వరలోనే తాము ఆయుధాలు విడిచే తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ వార్తలను జర్నలిస్టులు ఎప్పటికప్పుడు యూట్యూబ్ వివిధ ఛానల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో లాగే ఎం ఎం సి జోన్లో తమ పాత్రలను పోషించాలని కోరారు. (Story:ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి)

