పెన్సిల్ తో గీసిన చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు బహుకరించిన టీ నర్సాపురం వాసులు
న్యూస్ తెలుగు /చింతలపూడి : నరక కూపము లాంటి నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు చింతలపూడి ఎంఎల్ ఎ సొంగారోషన్ 1 కోటి 57 లక్షల వ్యయం తో 4 కిలోమీటర్ల మేర, చింతలపూడి నుంచి రావికంపాడు వయా టీ నర్సాపురం రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టడం ఆనందదాయకంగా ఉందని ప్రముఖ సోషల్ వర్కర్ నజీర్ భాష కొని ఆడారు . శుక్రవారం చింతలపూడి రావికంపాడు రోడ్డుకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా పనులు ప్రారంభించిన నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం వాసులు సోషల్ వర్కర్ ఎస్డి నసీర్ పాషా, కొరివి శేషరావు, కొరివి నాగేశ్వరావు, పి మధు, Ch. శ్రీనివాస్ లు కలసి ఎంతో ప్రయాస కోర్చి పెన్సిల్ స్కెచ్ తో శాసనసభ్యులు వారి ముఖచిత్రం గీయించి ఆ ప్రతిమను, అభినందన జ్ఞాపికగా శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ కు అందజేసారు. ఈ సందర్భంగా నజీర్ భాష మాట్లాడుతూ. నాలుగు కిలోమీటర్ల రోడ్డు నరకప్రాయంగా ఉందని కారులో వెళ్లాలన్నా అరగంట నుంచి ముప్పావు గంట వరకు పడుతుందని టి.నర్సాపురం నుంచి చింతలపూడి ఆసుపత్రులకు రావాలంటే నరకం కనబడుతుంది అన్నారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు పసికందులతో పడే బాధలు వర్ణనాతీతం అన్నారు. అటువంటి రోడ్డుకు మరమ్మత్తులు చేయించడం సొంగా రోషన్ కృషి మరువలేనిది అన్నారు. (Story:పెన్సిల్ తో గీసిన చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు బహుకరించిన టీ నర్సాపురం వాసులు)
