మంగంపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి :
పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిర్మాణంతో గ్రామాలలో పరిపాలన వ్యవస్థ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని గ్రామ పరిపాలన బాగున్నప్పుడే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గ్రామంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. (Story:మంగంపల్లి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే)
