Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌20 లక్షలకు పైగా పంచాయతీ పన్ను ఎగ్గొట్టిన బీఈడీ కళాశాల యాజమాన్యం

20 లక్షలకు పైగా పంచాయతీ పన్ను ఎగ్గొట్టిన బీఈడీ కళాశాల యాజమాన్యం

20 లక్షలకు పైగా పంచాయతీ పన్ను ఎగ్గొట్టిన బీఈడీ కళాశాల యాజమాన్యం

న్యూస్ తెలుగు/వినుకొండ : బ్రాహ్మణపల్లి పంచాయతీలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో అలీ బిఈడి కళాశాల నిర్వాకం గ్రామస్తులకు సమస్యాత్మకంగా మారింది. ఇష్టానుసారంగా నిబంధనలను ఉల్లంఘించి బిఈడి కళాశాల ఏర్పాటు చేసి చలామణి చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం బీఈడీ కళాశాల ఏర్పాటు చేసిన యాజమాన్యం ఒరిస్సా, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుంచి బీఈడీ విద్యార్థిని, విద్యార్థులు తరచూ ఇక్కడ పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. బీఈడీ కళాశాల ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అయినా పంచాయతీ పన్నులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా గుంటూరు కు చెందిన రాజకీయ నేత జియావుద్దీన్ వియ్యంకుడినని ప్రచారం చేసుకుంటూ.. పంచాయతీ అధికారులను, గ్రామ ప్రజలను బెదిరిస్తూ వ్యవహరిస్తూ ఉంటాడు. 15 సంవత్సరాల పంచాయతీ పన్ను దాదాపుగా 20 లక్షల పై మాటే చెల్లించాల్సి ఉంది. పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పన్ను కట్టమని అడిగినా కనీసం లెక్కచేయకుండా గేట్లు మూసేసి లోపలికి కూడా రానీయకుండా చేస్తారు. ఇటీవల వచ్చిన మొంతా తుఫాను వరదతో గ్రామం మొత్తం మునిగి పోయింది. దానిని తిరిగి పునర్దించాలంటే ఇలాంటి బడా వ్యాపారవేత్తలు పన్నులు సకాలంలో పంచాయతీకి చెల్లిస్తే వాటి ద్వారా గ్రామాన్ని చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ వారు దీనిపై వెంటనే విచారణ జరిపించి పంచాయతీకి బకాయి ఉన్నటువంటి పన్నులను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని యూనిట్ ఇంచార్జ్ షేక్ జానీ మరియు గ్రామస్తులు కోరారు.(Story : 20 లక్షలకు పైగా పంచాయతీ పన్ను ఎగ్గొట్టిన బీఈడీ కళాశాల యాజమాన్యం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!