పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి పోలీసు అధికారులకు సూచించారు. గురువారం డిజిపి కార్యాలయం నుండి పోలీసు ఉన్నతాధికారులు, పోలీసుకమిషనర్లు, జిల్లా ఎస్పీలతో దృశ్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
వనపర్తి జిల్లాలో కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను డిజిపికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వివరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసుశాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు.
దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మారిన సిసి టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి, నేరం చేయని వారికి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో సాంకేతికపరమైన సంస్కరణలు తీసుకురావాలని, తద్వారా మంచి ఫలితాలు, సమర్ధ సేవలు ప్రజలకు అందాలన్న సంకల్పం పోలీసుశాఖ లక్ష్యంగా పనిచేయాలని అన్నారు అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలు, ప్రజలను సమన్వయం చేస్తూ వాటిని అధిగమించేలా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అధికారులకు డిజిపి గారు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ,వీరా రెడ్డి, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, జిల్లా పోలీస్ కార్యాలయం ఏవో, సునందన, వనపర్తి సీఐ,కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్, సిఐ, నరేష్,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,
డిసిఆర్బి ఎస్సై , తిరుపతి రెడ్డి, డీసీఆర్బీ కానిస్టేబుల్ ఈశ్వర్, ఐటీ కోరు సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు. (Story:పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి)

