Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత‌

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత‌

0

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత‌

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం, కారుమంచి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్ వలి, బత్తుల యశోద కుమారి, బత్తుల నాగమూర్తమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కారుమంచి గ్రామంలోని వారి కుటుంబాలను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ 100 సభ్యత్వ ప్రమాద భీమా పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండడం పార్టీ బాధ్యత అన్నారు. మృతి చెందిన కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. (Story:టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version