ఘణంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
ఆటల పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం లైబ్రరీయన్ రాధ
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు పట్టణ వేద సమాజం దగ్గర ఉన్న శాఖ గ్రంధాలయంలో 58 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు లైబ్రరీయన్ రాధ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.అలాగే ఈ వారం రోజులు పలు పాఠశాల విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా గురువారం జాతీయ గ్రంధాలయ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ఎంఈఓ అప్పల నాయుడు,హెచ్ఎం టి.నాగేశ్వరరావు,రిటైర్డ్ టీచర్ అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వారి చేతుల మీదుగా కబడ్డీ, డ్రాయింగ్, దేశభక్తి గేయాలు ఇంకా పద్యాలు పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేసారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతు విద్యార్థులుకు లైబ్రరీ యొక్క ఆవశ్యకత అలాగే విజ్ఞానం ఎలా పెంపొందించాలో అనేక విషయాలపై అవగాహన కల్పించారు.స్కూల్ టీచర్స్ గ్రంధాలయ పాఠక శ్రోతలు తదితరులు పాల్గొన్నారు. (Story:ఘణంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు)
