వృద్ధాశ్రమంలో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం అన్నదానం
న్యూస్ తెలుగు /వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా స్థానిక వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మంగళవారం గుమ్మడి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నాప్రగడ వెంకటేశ్వరరావు, తిరువాయి పాటి శేషయ్య, గుడిపాటి సాంబశివరావు, ఎం.వి. శర్మ తదితరులు పాల్గొన్నా (Story:”వృద్ధాశ్రమంలో విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం అన్నదానం)

