శాలివాహన సంఘం
కార్తీక వన మహోత్సవం లో జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణం పసుపులేరు బ్రిడ్జి నందు ఉన్న ఖాదర్ బాబా ఆశ్రమం లో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాలివాహన సంఘం సభ్యులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ఉత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. జీవి సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:శాలివాహన సంఘం కార్తీక వన మహోత్సవం లో జీవి)
