పల్స్ హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి కొత్త బస్టాండ్ వెనకాల ఇటీవల నూతనంగా నిర్మించిన పల్స్ ఆసుపత్రిని ఆదివారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా వైద్యులు శ్రీనివాసులుతో ఆస్పత్రి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.వైద్యవృత్తి చాలా గొప్పదని వైద్యాన్ని వ్యాపారంగా చూడకుండా నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి మైనార్టీ నాయకుడు రహీం ఆసుపత్రి వర్గాలు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పల్స్ హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే )

