ఇరానీ చాయ్ హోటల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం కొత్త బస్టాండ్ వెనకాల పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన నరసింహ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ చాయ్ హోటల్ ను ఆదివారం శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇలాంటి వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరానీ డూడ్ చాయ్ హోటల్ ప్రారంభించిన నరసింహ రెడ్డి ని ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : ఇరానీ చాయ్ హోటల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే )

