నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎంపీ రావుల
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం ఖిల్లా ఘణపూరం మండలం గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణయ్య గౌడ్ ఇటీవల నూతన గృహప్రవేశం చేశారు. ఆదివారం మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కృష్ణయ్య గౌడ్ కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రాళ్లాకృష్ణయ్య , సౌమ్య నాయక్,మాజీ సర్పంచ్ లు టి.బాలస్వామి,వెంకటరమణ, సురేందర్, ప్రతాప్, బుచ్చిబాబు, గొడుగు సత్యం, టి.అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.(Story : నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎంపీ రావుల )

